Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

‘పెగాసస్‌ స్పైవేర్‌’ పై విచారణకు నిపుణుల కమిటీ : సుప్రీం

దేశంలో పెనుదుమారం రేపిన పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. పెగాసస్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని స్పష్టంచేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది. గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెగాసస్‌ వ్యవహారంలో గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనేది కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. పౌరులపై నిఘాలో విదేశీ ఏజెన్సీల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img