Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆర్‌బీఐ కొత్త పథకాలతో.. పెట్టుబడులు విస్తృతం : ప్రధాని మోదీ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన రెండు కొత్త పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించారు. ఆర్బీఐ రిటేల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌తో పాటు రిజర్వ్‌ బ్యాంక్‌-ఇంటగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఈ మహమ్మారి సమయంలో ఆర్‌బీఐ ప్రశంసనీయమైన పని చేసిందని అన్నారు. సామాన్య ప్రజల సౌలభ్యాన్ని పెంచేందుకు, వారిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ నిరంతరం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. కస్టమర్‌ కేంద్రీకృతమైన రెండు కొత్త స్కీమ్‌ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందన్నారు. దీంతో మూలధన మార్కెట్‌ మరింత సులువు అవుతుందని, సురక్షితంగా మారుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ కొత్త స్కీమ్‌లకు చిన్న ఇన్వెస్టర్లకు డైరెక్ట్‌ యాక్సిస్‌ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్‌ బ్యాంక్‌ పనిచేసిన విధానాన్ని అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img