Friday, May 3, 2024
Friday, May 3, 2024

సరిహద్దుల పహారాలో పోలీసుల పాత్ర భేష్‌ : అజిత్‌ ధోవల్‌

హైదరాబాద్‌ : శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా, సరిహద్దుల పహారాలో పోలీసులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, పాకిస్థాన్‌, చైనా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లతో కూడిన 15వేల కిలోమీటర్లున్న సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి పోలీసుల పాత్ర మరువలేనిదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో జరిగిన 73వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల పాసింగ్‌ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారం తీరప్రాంతాల నుంచి సరిహద్దు ప్రాంతాల వరకూ ఉన్న ఆఖరి పోలీసు స్టేషన్‌ వరకు వెళుతుందన్నారు. శాంతిభద్రతలను కాపాడటమనేది భారతదేశంలో 32 లక్షల కిలోమీటర్లలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉండే పోలీసులు విధి అని పేర్కొన్నారు. మీరు ఇక్కడ నేర్చుకున్నది ఒక్కటే కాదు.. దాని పరిధిని కూడా విస్తరించాలి. ఈ దేశ సరిహద్దులను రక్షించడమే మీ బాధ్యత. 15వేల కిలోమీటర్లు ఉన్న సరిహద్దుల్లో తీవ్ర సమస్యలు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. చైనా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లతో కలిసి పాకిస్థాన్‌లో మనకు ఓ సరిహద్దు ఉంది. ఈ బోర్డర్లను నిర్వహిస్తున్న పోలీసులు, కేంద్ర పోలీసు సంస్థలకు రోజూ వివిధ రకాల భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ధోవల్‌ అంచనా ప్రకారం దేశంలో 21 లక్షలమంది పోలీసులు ఉండగా, వారిలో 35,480మంది ఇప్పటి వరకూ వివిధ ఘటనల్లో, లేదా కారణాలతో మృతి చెందారని వివరించారు. 100 స్వాతంత్య్రదినోత్సవం దిశగా దూసుకెళుతున్న భారతదేశం కొత్తశకానికి నాంది పలకబోతోందన్నారు. ప్రజాస్వామ్యమంటే బ్యాలెట్‌ బాక్స్‌లో లేదని, కానీ అది ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడిన లేదా ఎన్నికమైన వ్యక్తులచే రూపొందించబడిన చట్టాలలో ఉందని ధోవల్‌ తెలిపారు. చట్టాలు.. అవి తయారు చేసిన సులభంగా ఉండవనీ, ఎక్కడైతే న్యాయం విఫలమవుతుందో ఏ జాతి నిర్మాణం జరగలేదన్నారు. చట్టాలు అమలు చేసే వారు బలహీనంగా, అవినీతికి పాల్పడి, పక్షపాతంగా ఉంటే ప్రజలు భద్రంగా, సురక్షితంగా ఉండలేరన్నారు. దేశానికి సేవ చేయడం కోసం బలమైన మానసిక వైఖరి అవసరం, ఇందుకోసం పోలీసులు ఇతర సంస్థలతో కలిసి పనిచేయాలని ధోవల్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img