Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తమిళనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు

చెన్నై : ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో తమిళనాడు లో కురవాల్సిన వర్షపాతం కన్నా 68 శాతం అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిరచింది. భారీ వర్షాల కారణంగా గడచిన గత 24 గంటల్లో ముగ్గురు వ్యక్తులు, 300కు పైగా పశువులు మృతి చెందాయని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడిరచింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి రామచంద్రన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్టోబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు 518.99 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇది సాధారణం కన్నా 68 శాతం ఎక్కువని తెలిపారు. గడచిన 24 గంటల్లో తిరుపత్తూరు జిల్లాలో అత్యధికంగా 39.91 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు. కావేరి పరివాహక ప్రాంతాలకు నీరందించే సేలంలోని మెట్టూరు, తదితర రిజర్వాయర్ల నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. విల్లుపురం, కాంచీపురంలోని నదులు పొంగి పొర్లుతున్నాయని చెప్పారు. విల్లుపురంలోని తెన్పెనై నది ఉధృతి కారణంగా 18,500 హెక్టార్లలో పంట నీట మునిగిందని, జిల్లాలో దాదాపు 220 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి 10 వేల మందికి సహాయం అందిస్తున్నట్టుతెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 419 సహాయక శిబిరాలల్లో 34 వేల మందిని ఉంచినట్టు వివరించారు. భారీ వర్షాలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ వారి ప్రాంతాల నుంచి తరలించినట్టు తెలిపారు. ఇప్పటికీ చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img