Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఏ వర్గానికి నష్టం లేకుండా..ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు

: కేరళ సీఎం విజయన్‌
తిరువనంతపురం : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్ధేశించిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల కల్పనకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. ఈ రిజర్వేషన్‌ల కల్పన ద్వారా ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్‌ విధానాన్ని దెబ్బతీస్తోందని అనవసర ఆందోళనలు సృష్టించే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వివరాల సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వేను ఆయన శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు లేని ఒక వర్గం ప్రజల్లోనూ చాలా మంది పేదవారు ఉన్నారని, వారికి కూడా రిజర్వేషన్ల ప్రయోజనాలు అందించాలని అటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఏ ఇతర వర్గాలకు నష్టం వాటిల్లకుండా ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆందోళనలకు పురిగొల్వే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్రవర్ణాల్లోని పేదలు కొత్తగా ఈ ఫలితాలను పొందడం ద్వారా మంచి జీవన స్థితిని కల్పించడం చాలా అవసరమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img