Monday, May 6, 2024
Monday, May 6, 2024

సభ సజావుగా జరగాలి..

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
న్యూదిల్లీ : దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తీవ్రమైన చర్చమైన అవసరమని, సభ సజావుగా, ఒక క్రమపద్ధతిలో జరిగే చూడటానికి సభ్యులు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సోమవారం తెలిపారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన హిందీలో వరుస ట్వీట్‌లు చేస్తూ, సభ్యులు సభ నిర్వహణ సమయంలో క్రమశిక్షణ పాటిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 23న ముగుస్తాయి. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సభలో తీవ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని అన్నారు. సభలో ఈ సమస్యలను లేవనెత్తుతారని దేశ ప్రజలు ఆశాభావంతో ఉన్నారని ఆయన తెలిపారు. వివిధ అంశాలను లేవనెత్తడానికి ఎంపీలకు తగిన సమయం, అవకాశాలను ఇవ్వడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు. సభ సజావుగా, ఒక క్రమపద్ధతిలో సాగేలా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయని స్పీకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా సమష్టి కృషితో సభ గౌరవాన్ని పెంచుతాం’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img