Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతి అంశంపై చర్చకు సిద్ధం..

శాంతియుతంగా చర్చించుకుందాం : ప్రధాని మోడీ

ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు, శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియతో మాట్లాడారు. పార్లమెంటులో అన్ని ప్రశ్నలను ఎదుర్కొని, సమాధానం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రతి సామాన్య పౌరుడు ఈ పార్లమెంటు సమావేశాలు గమనిస్తారని, వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు దేశ ప్రయోజనాల కోసం చర్చలు జరపాలని, దేశాభివృద్ధి కొరకు కొత్త మార్గాలను కనుగొనాలని ప్రధాని అన్నారు. ఈ పార్లమెంటు సభా కార్యకలాపాలు సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు మోడీ తెలిపారు. పార్లమెంటులో చర్చించాలని, సభ గౌరవ, మర్యాదలను కాపాడాలని చెప్పారు. వాయిదాలు, అంతరాయాలు కాకుండా అర్థవంతమైన చర్చ జరిగిందని ఈ సమావేశాలు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ఆకాక్షించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పినంత మాత్రాన పార్లమెంటు గౌరవానికి, స్పీకర్‌ గౌరవానికి సంబంధించి, రాబోయే రోజుల్లో దేశంలోని యువ తరానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలని మోదీ అన్నారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు..దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహిస్తున్నామని చెప్పారు. అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img