Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

మఖానా ఉత్పత్తిని పెంచేందుకు కొత్త సాంకేతికత : తోమర్‌

న్యూదిల్లీ : మఖానా ఉత్పత్తిని పెంచడానికి దేశంలోని ప్రధాన వ్యవసాయ-పరిశోధన సంస్థ ఐసీఏఆర్‌ సాంకేతికతను అభివృద్ధి చేసిందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం తెలిపారు. తోమర్‌, లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో ఇలా అన్నారు: ‘గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ఆహార పదార్థాల్లో మఖానా వాడకం కూడా పెరుగుతోంది. ఐసీఏఆర్‌ క్రాపింగ్‌ సిస్టమ్‌ మోడ్‌లో మఖానా సాగు కోసం సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి నీటి మిగులు పర్యావరణాల కోసం మఖానా ఆధారిత సమగ్ర వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేసింది’ అని మంత్రి చెప్పారు. ప్రస్తుతం మఖానా వాణిజ్య సాగు ప్రధానంగా బీహార్‌కే పరిమితమైందని, 2020-21 సంవత్సరంలో 56,194.59 టన్నుల ఉత్పత్తిని సాధించామని, అయితే ఉత్పత్తికి సంబంధించిన రాష్ట్రాల వారీ డేటా అందుబాటులో లేదని ఆయన అన్నారు. బీహార్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రాయోజిత పథకాన్ని కూడా రూపొందించిందని మంత్రి తెలిపారు. మఖానా వికాస్‌ స్కీమ్‌ కింద ఉత్పత్తిని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img