Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

రైతులు పంటలు నష్టపోతే పట్టించుకునే నాథుడే లేడు

: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు
వైసీపీకి ఓట్లు వేసిన రైతులు ఇప్పుడు కన్నీరు పెడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. మంగవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులు పంటలు నష్టపోతే పట్టించుకునే నాధుడే లేడని, ఆ పంటలను చూస్తే కన్నీరు వస్తుందన్నారు. మిర్చి పంటకు వచ్చిన తెగులేంటో అధికారులు గుర్తించలేకపోయారని, ఎంపీలు, ఎమ్మెల్యే లు ఏమైపోయారో అర్దం కావడం లేదన్నారు. ధరల స్దిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు.పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, రైతులను జగన్‌ రెడ్డి నిలువునా ముంచారని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి కుటుంబ సభ్యులపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. కౌరవ సభగా మారిన అసెంబ్లీని గౌరవ సభగా మార్చాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే మళ్లీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని ఆనంద బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు నుంచే యాత్ర ప్రారంభించారని, మరోసారి టీడీపీ పోరాటానికి పల్నాడు నుంచే ప్రారంభిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img