Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ కీలక పాత్ర : సీఎం కేసీఆర్‌


ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ కీలక పాత్ర పోషించారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణను హృదయపూర్వకంగా, చేతులు జోడిరచి అభినందిస్తున్నానని పేర్కొన్నారు. నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్‌ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా హైదరాబాద్‌ పురోగమిస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. . హైదరాబాద్‌ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్‌ ఎన్వీ రమణ ఒకరు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. అనేక రంగాల్లో హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా మారుతోందని కేసీఆర్‌ చెప్పారు. ఐఏఎంసీ, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవచ్చని కేసీఆర్‌ అన్నారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, నగరానికి, మన వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ సెంటర్‌ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కంపెనీలు, పెట్టుబడిదారుల మధ్య వివాదాలను పరిష్కరించడం ఈ సెంటర్‌ లక్ష్యం.రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డినెన్స్‌ ద్వారా చట్టాలు తీసుకొస్తామన్నారు. మంచి ఉత్తమమైన సెంటర్‌ను ఇక్కడ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img