Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ముంబైలో బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

ఏడుగురు మృతి, 15 మందికి తీవ్రగాయాలు..
ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి ఏడుగురు మృతిచెందారు. ఇద్దరు సజీవ దహనం కాగా.. మరో ఐదుగురు ఆసుపత్రిలో మరణించారు. దీంతోపాటు మరో 15 మందికి తీవ్ర గాయలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముంబై నగరంలోని భాటియా ఆసుపత్రికి సమీపంలోని బహుళ అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. గౌలియా ట్యాంక్‌ ఏరియాలోని నానాచౌక్‌ కమలా బిల్డింగ్‌ 18వ అంతస్తులో శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే 17 అగ్నిమాపక వాహనాలు, 5 అంబులెన్సులను సంఘటన స్థలానికి తరలించారు.ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img