Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభించిన సీఎం జగన్‌

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని 45`60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆర్థిక స్వావలంభనకు ఉద్దేశించిన ‘వైఎస్సాఆర్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం చేస్తున్నట్లు జగన్‌ ఈ సందర్భంగా వివరించారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసున్న అగ్రవర్ణ మహిళలకు ఈ డబ్బులు జమచేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ తాము నెరవేర్చుతున్నామని చెప్పారు. ఈబీసీ నేస్తం ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, వెలమ వర్గాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈబీసీలోని పేదల మెరుగైన జీవనోపాది, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img