Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు

కొత్తగా 2,51,209 పాజిటివ్‌ కేసులు,627 మరణాలు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 2,51,209 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 627 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 15.88 శాతం ఉన్నట్లు తెలిపింది.నిన్న కరోనా మహమ్మారి నుంచి 3,47,443 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 21,05,611 కేసులు (5.18శాతం) యాక్టివ్‌గా ఉన్నాయి.తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,06,22,709 చేరగా.. మరణాల సంఖ్య 4,92,327కి పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 3,3,80,24,771 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 72,37,48,555 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,64,44,73,216 టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img