Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో యువతనే ఎక్కువ

ఐసీఎంఆర్‌ సర్వే వెల్లడి
దేశంలోని ఒమిక్రాన్‌ బాధితుల్లో యువతరమే అధికమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) సర్వే వెల్లడిరచింది. 2021వ సంవత్సరం డిసెంబర్‌ 16 నుంచి 2022వ సంవత్సరం జనవరి 17వతేదీ మధ్య ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితుల డేటాను విశ్లేషించగా యువతకే అధికంగా ఒమిక్రాన్‌ సోకిందని తేలింది. థర్డ్‌ వేవ్‌ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ రోగులకు కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎంఆర్‌ సర్వేలో తేలిందని వైద్యులు వివరించారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు సమస్యలు ఎక్కువగా కనిపించాయని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా 37 ఆసుపత్రుల నుంచి కరోనా రోగుల డేటాను సేకరించినట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. థర్డ్‌వేవ్‌ సమయంలో ఆసుపత్రిలో చేరిన వారి సగటు వయస్సు దాదాపు 44 సంవత్సరాలని బలరాం చెప్పారు. అంతకుముందు కరోనా రోగుల సగటు వయస్సు 55 ఏళ్లని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img