Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్‌


ఉత్తరాఖండ్‌, గోవా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. గోవా రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. 301మంది అభ్యర్థుల భవితవ్యాన్ని గోవా ఓటర్లు నిర్ణయించనున్నారు. అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది..గోవాలో సీఎం ప్రమోద్‌ సావంత్‌, ప్రతిపక్ష నేత దిగంబర్‌ కామత్‌, మాజీ సీఎం చుర్చిల్‌ అలీమావో, మాజీ సీఎం కుమారుడు ఉత్పల్‌ పారికర్‌ లు పోటీ చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌ లోని 55 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ చేపట్టారు. యూపీలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.ఉత్తరాఖండ్‌ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్‌ జరగనుంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. ఉత్తరాఖండ్‌ బరిలో 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 82,38,187 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img