Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వివాహేతర సంబంధం అనైతిక చర్యే!…

ఆ కారణంతో విధుల నుంచి తొలగించకూడదు!
సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని ‘‘అనైతిక చర్య’’గా చూడగలిగినప్పటికీ, దానిని ‘‘దుష్ప్రవర్తన’’గా పరిగణించలేమని గుజరాత్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్‌ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్‌ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు.‘‘అయితే పిటిషనర్‌ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని’’ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img