Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు టికెట్‌ ఛార్జీల్లో రౌండప్‌ విధానం

తెలంగాణలోని పల్లెవెలుగు బస్సు టికెట్‌ ధరల్లో రౌండప్‌ విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ రౌండప్‌ చార్జీలను ఖరారు చేశారు. నేటి నుంచి ఈ కొత్త(రౌండప్‌) చార్జీలను ఆర్టీసీ అమలులోకి తీసుకువచ్చింది. రూ.12చార్జీ ఉన్న చోట టికెట్‌ను యాజమాన్యం రూ.10 రౌండప్‌ చేసింది. రూ.13, రూ.14 ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 5గా రౌండప్‌ చేశారు. 80 కీలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్‌ ఖరారుతో చార్జీలు రూ.65గా నిర్ధారించారు. టోల్‌ ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1.. హైటెక్‌, ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img