Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే దళిత బంధుకు శ్రీకారం

: మంత్రి తలసాని
దళితులను అత్యున్నత స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దళిత బంధు కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా రంగాలలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మందికి ఈ కార్యక్రమం వర్తిస్తుందని తలసాని స్పష్టం చేశారు. ఇంతటి సాహసోపేత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img