Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

2022లో థర్మల్‌ స్టేషన్‌లకు 25% పెరిగిన బొగ్గు ఉత్పత్తి

న్యూదిల్లీ: గతేడాది కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో థర్మల్‌ స్టేషన్‌లకు సరఫరా చేసిన బొగ్గు 24.5శాతం నుంచి 677.67 మిలియన్‌ టన్నులకు పెరిగిందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అయితే పెరిగిన బొగ్గు సరఫరా శాతం అటుంచితే, ఇప్పటికీ కొన్ని థర్మల్‌ స్టేషన్‌లకు విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువ ఉన్న కారణంగా బొగ్గు కొరత ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 544.07 మెట్రిక్‌ టన్నులు సరఫరా జరగ్గా, 2020 ఆర్థిక సంవత్సరంలో 567.25 మెట్రిక్‌ టన్నులు సరఫరా అయింది. మొత్తంగా 2021 ఆర్థిక సంవత్సరంలో 691.39 మెట్రిక్‌ టన్నులు బొగ్గు ఉత్పత్తి జరగ్గా అది 2022 ఆర్థిక సంవత్సరంలో 818.14 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. అంతకుముందు దీనిపై కోల్‌ సెక్రటరీ ఏకే జైన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ డిమాండ్‌ తీవ్రంగా ఉండటంతో బొగ్గు గనులు సొంత చేసుకున్న వారికి ఉత్పత్తి పెంచుకునేందుకు ఇది ఓ మంచి అవకాశమని వ్యాఖ్యానించారు. గత సంవత్సరం అక్టోబరులో చాలా రాష్ట్రాలు తాము బొగ్గు కొరతను ఎదుర్కొన్నట్టు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు కూడా తప్పలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img