Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాష్ట్రపతి ఆమోదం కోసం ‘నీట్‌’ వ్యతిరేక బిల్లు

రాష్ట్ర గవర్నర్‌ కేంద్రానికి పంపారు
తమిళనాడు సీఎం స్టాలిన్‌

చెన్నై : నేషనల్‌ ఎంట్రన్స్‌-కమ్‌-ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నీట్‌) నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బిల్లును గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపినట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ బుధవారం తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపేందుకు వీలుగా బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు గవర్నర్‌ కార్యదర్శి తనకు తెలియజేసినట్లు స్టాలిన్‌ రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు. ‘నీట్‌ మినహాయింపు కోసం మన పోరాటంలో భాగంగా తదుపరి దశలో బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రాన్ని పట్టుబట్టేందుకు మనం సంయుక్తంగా అన్ని ప్రయత్నాలను చేపట్టాలి’ అని ఆయన అన్నారు. గత ఏడాది బిల్లును గవర్నర్‌ తిప్పి పంపిన తర్వాత, ఫిబ్రవరిలో అధికార డీఎంకే ప్రవేశపెట్టిన ‘నీట్‌’ వ్యతిరేక బిల్లును అసెంబ్లీ రెండోసారి ఆమోదించింది. తమ ప్రభుత్వం గట్టి పట్టుదలతో చేస్తున్న ప్రయత్నమే ప్రస్తుత ఈ చర్యకు దారితీసిందని, ‘నీట్‌’ మినహాయింపు కోసం తాను తీసుకున్న అనేక చర్యలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. గవర్నర్‌ బిల్లును తిరిగి ఇచ్చిన వెంటనే తమ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యపై చర్చించిందని అన్నారు. ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో గవర్నర్‌ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారని స్టాలిన్‌ తెలిపారు. గవర్నర్‌ను స్వయంగా కలిసి బిల్లును కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేయడమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమస్యను ప్రస్తావించామని అన్నారు. దీనికి సంబంధించి అఖిలపక్ష ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించినట్లు స్టాలిన్‌ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img