Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

కేంద్రంపై ప్రియాంక మండిపాటు

కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదంటూ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కరోనా మహమ్మారితో దేశం విలవిల్లాడుతున్న సమయంలో కేంద్రం ఆక్సిజన్‌ ఎగుమతులను 700 శాతం పెంచిందని ట్వీట్‌ చేశారు. ఆక్సిజన్‌ సరఫరాకు ట్యాంకర్లను ఏర్పాట్లు చేయలేకపోవడం వల్ల కోవిడ్‌ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. సాధికారతా గ్రూపు, పార్లమెంటరీ కమిటీ సూచనలు కేంద్రం నిర్లక్ష్యం చేసి ఆక్సిజన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img