Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అడుగడుగునా నిర్బంధం

వామపక్ష నేతల ముందస్తు అరెస్టులు
గృహ నిర్బంధాలు బ స్టేషన్లకు తరలింపు
అరెస్టులపై ఆగ్రహజ్వాల

విశాలాంధ్ర`శ్రీకాకుళం: అడుగడుగునా పోలీసు ఆంక్షలు..అరెస్టులు…గృహనిర్బంధాలు..సీఎం జగన్‌ పర్యటన ఉందంటే కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల నాయకులకు చుక్కలే. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా ఇది అనవాయితీగా మారింది. సీఎం జగన్‌కు ప్రజలంటే భయమా? మూడేళ్లలో ఎంతో చేశానని చెప్పుకుంటున్న జగన్‌కు భయమెందుకు? వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు కేవలం ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. దీనిని సైతం అడ్డుకోవడం దారుణం. తాజాగా సోమవారం శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. గృహ నిర్బంధం చేశారు. ఆదివారం సాయం త్రం టెక్కలిలో ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు, డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు యడ్ల గోపిలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టే షన్‌కు తరలించారు. శ్రీకాకుళం ఏఐటీయు గౌరవ సలహాదారు చిక్కాల గోవింద రావు, సీపీఐ శ్రీకాకుళం నగర కార్యదర్శి డోల శంకరరావులను సోమవారం ఉదయం 5గంటల నుంచే గృహనిర్బంధంలో ఉంచారు. పలాస నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులు, గృహనిర్బంధంపై నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు కూడా ఇవ్వనివ్వరా అని ప్రశ్నించారు. సీఎంను కలవకుండా గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలÛ హక్కును హరిస్తున్నదని మండిపడ్డారు. అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. వామపక్ష నాయకుల అరెస్టులను సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి ఖండిరచారు. ప్రజల పక్షాన పోరాడే వారిపై పోలీసులు అవలంబిస్తున్న తీరు ఆక్షేపణీయమని ఆయన అన్నారు.
ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం: ముప్పాళ్ల
ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అలవాటుగా మారిందని, ఇది అప్రజాస్వామికమని, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, దీంతో వైసీపీ నాయకులు ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరగలేపోతున్నారన్నారు. సహజంగా ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడిన వారిని నిర్బంధించడం, అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. వామపక్షాల నాయకుల అరెస్టులను ముప్పాళ్ల తీవ్రంగా ఖండిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img