Friday, May 3, 2024
Friday, May 3, 2024

మళ్లీ పట్టాలెక్కనున్న ఆ 13 రైళ్లు

ఇటీవల పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ మేరకు రద్దు చేసిన 13 డెమో రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్‌, గూడూర్‌-విజయవాడ, నిజామాబాద్‌-నాందేడ్‌, నాందేడ్‌-నిజామాబాద్‌, విజయవాడ – తెనాలి, తెనాలి-విజయవాడ రైళ్లను పునరుద్ధరించింది. కర్నూల్‌ సిటీ-నంద్యాల, నంద్యాల-కర్నూల్‌ సిటీ, గుంటూరు -విజయవాడ, విజయవాడ -గుంటూరు, విజయవాడ – ఒంగోలు, ఒంగోలు-విజయవాడ మధ్యలో నడిచే రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. దీంతో పాటు వారాంతాల్లో నడిచే నాందేడ్‌ -పుణె (17630), పుణె – నాందేడ్‌ (17629) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిత్యం నడుపనున్నది. నాందేడ్‌లో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం.5.30 గంటలకు పుణె చేరనున్నది. పుణెలో రాత్రి 9.35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.20 గంటలకు నాందేడ్‌కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img