Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సైనికుడికి శిక్ష రద్దు చేయాలి : కేకేఈ

ఏథెన్స్‌ : గ్రీస్‌ సైనికుడు నాటో వ్యతిరేక అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసినందున గాను శిక్షకు గురయ్యాడు. నాటో, అమెరికాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశాడని నేషనల్‌ మిలిషియా బెటాలియన్‌కు చెందిన ఒక సైనికుడు అతని యూనిట్‌ చేత శిక్షించబడ్డాడని 902 పోర్టల్‌ నివేదించింది. ఆ సైనికుడు ఒక లేఖను ప్రచురించాడు, అందులో అతను ప్రమాదకరమైన యూఎస్‌`నాటో సామ్రాజ్యవాద ప్రణాళికలలో గ్రీస్‌ పాల్గొనడాన్ని, ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో ప్రమేయాన్ని వ్యతిరేకించాడు. ఆ సైనికుడిపై శిక్షను వెంటనే రద్దుచేయాలని గ్రీసు కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) డిమాండ్‌ చేసింది. ‘‘సైనిక క్రమశిక్షణ’’ అనే వాదన ప్రకారం, వారు తమ సేవా వ్యవధిలో వారి అభిప్రాయాలు, ఆలోచనలు, ఆందోళనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వారి హక్కును యువకులకు హరించడానికి ప్రయత్నిస్తారు’’ సైనికుడిపై శిక్షలు అమలుచేయకుండా ట్రేడ్‌ యూనియన్లు, స్టూడెంట్‌ యూనియన్లు మద్దతు పలకాలని కేకేఈ పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని యూనిట్ల సైనికులు ఈ ప్రమాదకరమైన ఘటనను ఖండిరచాలని పేర్కొంది. సైనికులు ప్రజల బిడ్డలు, వారికి రాజకీయ హక్కులు ఉన్నాయని కేకేఈ ప్రకటన పేర్కొంది. 2018లో ఏథెన్స్‌లో కెకెఇ నిర్వహించిన యుద్ధ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని మాట్లాడినందుకు ఒక సైనికుడు శిక్షకుగురయ్యాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img