Friday, May 3, 2024
Friday, May 3, 2024

బైడెన్‌ పర్యటనపై పలస్తీనాలో నిరసనలు

రమల్లా: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పలస్తీనా పర్యటనకు నిరసనగా గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు.‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌, ఇది పూర్తిగా వర్ణవివక్ష’’ అనే సంకేతంతో బైడెన్‌ను స్వాగతించడానికి బెత్లెహెేమ్‌, రమల్లాలో వరుస బిల్‌బోర్డ్‌లు, డిజిటల్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. తూర్పు జెరూసలేంలోని అగస్టా విక్టోరియా ఆసుపత్రి సమీపంలో పలస్తీనియన్లు అధ్యక్షుడు బైడెన్‌ పర్యటనను నిరసించారు.
పలస్తీనియన్లపై బైడెన్‌ నిరంకుశ వైఖరిపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు, పలస్తీనా ఆరోగ్య కార్యకర్తలు, అధికారులతో జరిగిన సమావేశాలలో బైడెన్‌పై పలస్తీనియన్లు తీవ్ర విముఖత వ్యక్తం చేశారు.వెస్ట్‌ బ్యాంక్‌ నగరమైన బెత్లెహెమ్‌లో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనను ఎదుర్కొన్నారు. బైడెన్‌ అధ్యక్షుడిగా మధ్యప్రాచ్యంలో తన మొదటి పర్యటనను ప్రారంభించాడు. బైడెన్‌ పాలన పూర్తిగా వర్ణవివిక్షతో కూడిన పర్యటనగా పలస్తీనియన్లు ఆరోపించారు. బైడెన్‌ సౌదీ అరేబియాకు వెళ్లే ముందు పలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా జరిగిన విలేకరుల సమావేశంలో అబ్బాస్‌ మాట్లాడుతూ, పలస్తీనాలో ఇజ్రాయిల్‌ సెటిల్మెంట్లను నిలిపివేయాలని, అబూ అక్లేప్‌ా హంతకులకు తగిన శిక్ష విధించాలని అన్నారు. పలస్తీనా-ఇజ్రాయిల్‌ వివాదానికి న్యాయమైన పరిష్కారం చేయాలని పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ ఎయిర్‌లైన్స్‌ సౌదీ గగనతలం మీదుగా ప్రయాణించడానికి సౌదీ అరేబియా నిర్ణయాన్ని బైడెన్‌ స్వాగతించారు, జెరూసలేంలో పలస్తీనియన్ల కాన్సులేట్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img