Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

క్లౌడ్‌ బరస్ట్‌ కాదు.. మామూలు వర్షమే

గవర్నర్‌ తమిళిసై
గోదావరికి సంభవించిన వరదల వెనుక క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర దాగి ఉందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల తెలంగాణ నాయకులు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. వరద సహాయక చర్యల్లో విఫలం కావడం వల్లే కేసీఆర్‌ ఈ కుట్ర ఆరోపణలను తెర మీదికి తెచ్చారంటూ మండిపడుతోన్నారు. ఇప్పుడు తాజాగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కేసీఆర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ ఆరోపణలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. గోదావరికి సంభవించిన వరదలు క్లౌడ్‌ బరస్ట్‌ వల్లే వచ్చాయని, దీని వెనక విదేశాల కుట్ర ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. అదేరోజు, అదే సమయంలో తమిళిసై సౌందరరాజన్‌ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నారు. వరద పరిస్థితులను ప్రత్యక్షంగా తిలకించారు. బాధితులను పరామర్శించారు. గోదావరికి వచ్చిన వరదలు క్లౌడ్‌ బరస్ట్‌ అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు. నది పరీవాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని, వాటి ఫలితంగా వరదలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కాబట్టి అవి ఎప్పుడూ వచ్చే వరదలేనని కాకపోతే ఈ సారి కాస్త ఎక్కువగా వచ్చాయన్నారు. అంత మాత్రాన క్లౌడ్‌ బరస్ట్‌ అనలేమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img