Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పారిశుధ్యాన్ని మెరుగు పరచాలి ప్రజారోగ్యానికి భద్రత కల్పించాలి

విశాలాంధ్ర – నాయుడుపేట : సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పంచాయతీల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచి ప్రజారోగ్యానికి భద్రత కల్పించాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.శుక్రవారం నాయుడుపేట ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి కురుగొండ ధనలక్షి ఆధ్వర్యంలో జరిగిన పారిశుద్ధ్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన పరికరాలకు అత్యాధునిక పారిశుధ్య పరికరాలను సర్పంచ్ లకు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తోపాటు డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో సర్పంచ్ ,ఎంపిటీసీ,కార్యదర్శులు పరస్పర సహకారం తో గ్రామాభివృద్ధి కి కృషిచేయాలని అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న తాను ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.ఎంపిపి కురుగొండ ధనలక్ష్మి మాట్లాడుతూ మండలంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్పంచ్ లు చెత్త నుండి సంపద కేంద్రాలను ,సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ప్రభుత్వం అందిస్తున్న పారిశుధ్య పరికరాల ను ఉపయోగించి పారిశుధ్యాన్ని మెరుగు పరచాలని సూచించారు. వైసిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ల్లో 4 నెలలుగా పారిశుధ్య కార్మికుల కు జీతాలు రాలేదని తెలిపారు. వారికి రావలసిన జీతాలు వెంటనే విడుదల చేయించాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ను కోరారు.అనంతరం మండలం లోని 18 మంది సర్పంచ్ లకు పాగింగ్ మిషన్లు, హై ప్రజర్ శానిటరీ కూలీనర్స్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి,ఎంపిడిఓ శివప్రసాద్,వైస్ ఎంపిపి నెలవల మమత,పలువురు సర్పంచ్ లు,ఎం పిటిసి లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img