Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం :శిశు మృతి !

కాన్పుల్లో జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉన్నాం..
నిర్లక్ష్యంగా వ్యవహరించడం అవాస్తవం.. డాక్టర్ జోషిరాయి

ఉంగుటూరు:ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి మేరీ రత్నకుమారి నొప్పులు రావడంతో ఈ నెల 20న తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కుటుంబ సభ్యులు కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఉదయం 9 గంటల సమయంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. 11 గంటలైన కాన్పు కాకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లామని బంధువులు కోరగా సహజ కాన్సు అవుతుందని కంగారు పడకూడదని వైద్యురాలు ప్రజ్ఞ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చాలా సమయం. ఆయింది. బాధితుల కథనం ప్రకారం ఫలితం లేదని వేరే ఆసుపత్రికి తీసుకెళ్తామని పట్టుబట్టారు. మమల్ని కాదని తీసుకెళ్లే మార్గమధ్యంలో ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదన్నారు. దీంతో అక్కడి ఉండిపోవాల్సి వచ్చింది. ఒంటి గంటకు కూడా కాన్పు కాకపోవడంతో రత్నకుమారి భర్త సురేష్, బంధువులు సిబ్బందిని నిలదీశారు. దీంతో 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రత్నకుమారిని పరీక్షించిన వైద్యులు శిశివు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తల్లి ప్రాణానికి కూడా అపాయమని చెప్పారు. అక్కడ నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసి శిశువు (పాప)ను బయటకు తీసేసరికి మరణించింది. పాపాకు తలమీద చిన్నచిన్న గాయాలు ఉన్నాయి. కాగుపాడు పీహెచ్సీ వైద్యురాలు ప్రజ్ఞ, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పాపా మరణించిందని తండ్రి సురేష్, బందువులు ఆరోపిస్తున్నారు.
వైద్య అధికారి వివరణ: కాగుపాడు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జోషి రాయి మాట్లాడుతూ 20వ తేదీ ఉదయం 7 గంటలకు మేరీ రత్నకుమారిని తమ పీహెచ్సీకి తీసుకొచ్చారని అప్పటికే ఉమ్మనీరు మొత్తం పోయిందన్నారు. వైద్యురాలు పరీక్షించి కంగారు పడవద్దని సహజ కాన్పు అవుతుందని సూచించారన్నారు. మేరీ రత్నకుమారి ముక్కకపోవడ ముగ్గురు నర్సులు సహజ కాన్పుకు ప్రయత్నించారు. శిశువు కదలికలు తగ్గుతున్నాయని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు. అక్కడ నుంచి ఏలూరు పంపించారన్నారు. మేరీ రత్నకుమారి సహకరించి ఉంటే సహజ కాన్పు అయి తల్లీబిడ్డ సురక్షితంగా ఉండేవారని చెప్పారు. కాన్పుల్లో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని నిర్లక్ష్యంగా వ్యవహరించడం అవాస్తవమని డాక్టర్ జోషి రవి వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img