Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

మురుగుతో ప్రజల సహజీవనం

అయోమయంలో గ్రామస్తులు
పట్టించుకోని పంచాయతీ అధికారులు

విశాలాంధ్ర`ముండ్లమూరు : మండల కేంద్రమైన ముండ్లమూరులో మురుగు గంగ రోడ్లపై తాండవిస్తోంది. కొద్దిపాటి వర్షానికి సిమెంట్‌ రోడ్లపై పారు తుండడంతో గ్రామస్తులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకా ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి మురుగునీరు ఏకంగా ప్రధాన వీధుల్లో ప్రవహిస్తుండడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నిత్యావసర సరుకుల కోసం వెళ్లే మహిళలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లే ఖాతాదారులు మీసేవకి వెళ్లే రైతులు సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు ఆ రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే నానా అవస్థలు పడుతూ నడవాల్సిన దుస్థితి నెలకొంది. సీసీ రోడ్లు వేశారు గాని సైడు కాలువలో పేరుకుపోయిన మురుగు మట్టిని తీసిన పాపాన పోలేదు అన్నారు. ఒకవైపు సైడ్‌ కాలువ అసలే లేదు. దీంతో నానా అవస్థలు పడుతూ రోగాల బారిన పడుతున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మంచాన పడితే గాని మురుగు సమస్య అధికారులకు గుర్తుకు వస్తుందేమో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కన్నెగండ్ల రాఘవ శిఖకొల్లి నవ్వమ్మ గృహాలలోకి మురుగు నీరు చేరడంతో ఆ గృహాల వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారులకు గోడు వెళ్లబోసుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కలుగజేసుకుని కాలువలో పేరుకుపోయిన మురుగు మట్టిని తొలగించి మురుగు నీరు పారుదలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img