Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అధిర్‌ ఇప్పటికే క్షమాపణ చెప్పారు : సోనియాగాంధీ

ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించిన అధిర్‌ రంజన్‌
పొరపాటున అన్నానని వివరణ ఇచ్చిన కాంగ్రెస్‌ నేత
సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటూ పార్లమెంట్‌లో బీజేపీ నిరసన

భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌధురి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై అధిర్‌ను క్షమాపణ చెప్పమని ఆదేశిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారని సోనియా అన్నారు.
మరోవైపు తన వ్యాఖ్యలపై అధిర్‌ రంజన్‌ వివరణ ఇచ్చారు. తాను పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించానని అన్నారు. అంతేతప్ప రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. దీన్ని అధికార పార్టీ నేతలు పెద్దది చేస్తూ చూపిస్తున్నారని విమర్శించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ఇంకోవైపు అధిర్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అధిర్‌ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ ముర్ముకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. లోక్‌ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో మరో మంత్రి నిర్మలా సీతారామన్‌.. అధిర్‌, కాంగ్రెస్‌ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img