Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వరిలో తెగుళ్లు పరిశీలించిన శాస్త్రవేత్తలు

అనుమసముద్రంపేట : వరి పైరును ఆశించే తెగుళ్లు కీటకాల వల్ల నష్టపోతున్న రైతులకు అవగాహన కల్పించి తెగుళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు నెల్లూరు డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు సురేఖ దేవి మండలంలోని వరి పేరును పరిశీలించారు. బుధవారం మండలంలోని అనుమసముద్రం తదితర గ్రామాల్లో నాటిన ఎడగారు వరి పైరును పరిశీలించారు. వరి పైరు పై ఆకు ముడత, కాండంతో లుచు పురుగులు ఉన్నట్లు గుర్తించారు. అయితే మిత్ర పురుగులు ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో రసాయనిక క్రిమిసంహారకాలు వాడాల్సిన అవసరం లేదని తెలిపారు. వేప నూనె పిచికారి చేస్తే సరిపోతుందని తెలిపారు. ఆకు ముడత కాండంతో పురుగుల నివారణకు గర్భస్థ సముదాయం నాశనం కాకుండా పురుగు సంతతి నివారణ చేయుటకు 2.5 మిల్లీ లీటర్ల క్లోరో పైరిపాస్ లేదా కర్టాఫ్ హైడ్రోక్లోరైడ్ రెండు మిల్లి గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ముందుగా గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లకు, స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలు అందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా రైతులకు సాధ్యమైనంత మేర సూచనలు సలహాలు ఇచ్చి అధిక దిగుబడులు సాధించేలా చూడాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతులు అన్ని విధాల మేలు చేసే కార్యక్రమం చేపట్టిందని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇసి ఏడిఏ మారుతీదేవి, ఆత్మకు ఏ డియే దేవసేనమ్మ, ఏఎస్ పేట వ్యవసాయ అధికారి రజిని, ఏఈవోలు చక్రవర్తి ,కిషోర్, వీఐఏలు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img