Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక చర్యలు

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

విశాలాంధ్ర : ముండ్లమూరు : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పాటుపడుతూ నాడు నేడు కార్యక్రమం అమలు చేస్తోందన్నారు మండలంలో నాడు నేడు కార్యక్రమం ఆలస్యంపై మండల విద్యాశాఖధికారి సాంబశివరావు ఎస్ ఎస్ ఎ ఏఈ కోటేశ్వరావు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాల నివేదికలు అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వ శిక్ష అభియాన్ ఎ ఈ కోటేశ్వరరావు ను మందలించారు నెల 9వ తేదీ లోపు నాడు నేడు రెండో విడత నివేదికను పూర్తిచేసి సంబంధిత కార్యాలయంలో అందజేయాలన్నారు అమూల్ పాల కేంద్రం నిర్వహణ వేగవంతం అయ్యేలా చూడాలన్నారు ఒక సమస్య పదే పదే పునరావృతం కాకుండా మండల స్థాయి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సచివాలయాల తనిఖీ సమయాలలో తప్పనిసరిగా రెండు రకాల రిజిస్టర్లు వెరిఫై చేయాలని సూచించారు ఓటర్ కార్డు కు ఆధార్ కార్డు అనుసంధానం చేసే క్రమంలో భాగంగా 6 బి ఫారాన్ని ప్రతి ఓటర్ నుండి తీసుకోవాలన్నారు బి ఎల్ వో లు ఈ ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు ఇళ్ల స్థలాలు మంజూరు అయిన వారందరూ సకాలంలో నిర్మాణాలు ప్రారంభించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఈఈ పీ శ్రీనివాస ప్రసాద్ డిఈ డి నిరీక్షణ రావు నియోజవర్గ ప్రత్యేక అధికారిని పీ గ్లోరియా మండల ప్రత్యేక అధికారి బీ రవీంద్రబాబు సి డి పి ఓ భారతి తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img