Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

అమెరికా సామ్రాజ్యవాదంపై కేకేఈ ఆగ్రహం

ఏథెన్స్‌ : క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్యవాద నేర ప్రణాళికలకు మద్దతునిచ్చే నీచమైన ఉమ్మడి ప్రకటనను కేకేఈ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌) ఖండిరచింది. క్యూబాకు వ్యతిరేకంగా గ్రీస్‌తో సహా ఇజ్రాయిల్‌, బ్రెజిల్‌, ఆస్ట్రియా, పోలాండ్‌, ఉక్రెయిన్‌, బాల్టిక్‌ దేశాల విదేశాంగ మంత్రులు సంతకం చేసిన ఉమ్మడి ప్రకటన క్యూబాను రెచ్చగొట్టే విధంగా ఉందని కేకేఈ మండిపడిరది. క్యూబా ప్రజల మానవహక్కులు, స్వేచ్ఛ, జీవన పరిస్థితుల గురించి కపట ఆందోళనలను వ్యక్తంచేయడంలో ఎన్‌డీ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతోందనీ, గ్రీస్‌లో కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రోత్సహిస్తోందని కేకేఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల వేతనాలు, హక్కులకు వ్యతిరేకంగా వీరు చేపట్టిన ఈ చర్య నేరపూరితమైనదిగా పేర్కొన్నది. ప్రజల ఉద్యమానికి హాని కలిగించే అమెరికా సామ్రాజ్యవాద చర్యలను కేకేఈ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. గ్రీసు ప్రజలు ఈ ప్రకటనను తిరస్కరించడం అవసరమని తెలిపింది. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రమాదకర ప్రణాళికలను ఎదుర్కోవడంలో క్యూబన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు కేకేఈ తన పూర్తిసంఫీుభావాన్ని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img