Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

బాల కార్మికలును రవాణాను ఛేదించిన జిల్లా మానవ అక్రమ రవాణా యూనిట్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: బాల కార్మికులను అక్రమంగా రవాణా చేస్తూన్నారునే సమాచారం మేరకు జిల్లా మానవ అక్రమ రవాణా యూనిట్ (AHTU) సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో బెంగుళూరుకు అక్రమంగా బాల కార్మికలను తరలిస్తున్నరు అనే రైల్వే చైల్డ్ లైన్, రైల్వే పోలీసులు సమాచారం అందుకున్న జిల్లా మానవ అక్రమ రవాణా యూనిట్ సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకుని ఐదుగురు బాలలను గుర్తించి వారి వివరాలు సేకరించారు.అందులో ఇద్దరు బాలలను వారి కుటుంబ సబ్యులకు సి డబ్ల్యూ సి వారి సమక్షంలో అప్పగించి,మిగిలిన ముగ్గురును విశాఖపట్నం అబ్జేర్వేషన్ వసతి గృహానికి అప్పగించారు. బాల కార్మికులను అక్రమ రవాణాను నిరోధించుటలో కీలక పాత్ర పోషించిన జిల్లా మానవ హక్కుల రవాణా విభాగం సిబ్బందికి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img