Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మత అజెండా కాదు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పోరాడండి

ఏపీ బీజేపీ నేతల తీరుపై రామకృష్ణ ఆగ్రహం

అమరావతి : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నూరుశాతం ప్రైవేటీకరిస్తామని, అవసరమైతే ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుబట్టారు. ఉద్యోగుల పొట్టకొట్టడమే బీజేపీ ధ్యేయంలా ఉందని, ఏపీ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మత అజెం డాను పక్కనపెట్టి..సేవ్‌ విశాఖ స్టీల్‌ అజెండాతో ముందుకు రావాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అఫిడవిట్‌ వేసిందని, స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత లేదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగి స్తామని స్పష్టం చేసిందని, ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని మొండిగా చెబుతోందని రామకృష్ణ వివరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరి స్తామని మోదీ నేతృత్వంలో కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని, ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని తెలిపిందని పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం వాదిస్తోందని తెలిపారు. ఉద్యమాల ద్వారా, 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు మోదీ ప్రభు త్వం చేస్తున్న కుటిల యత్నాలను తీవ్రంగా ఖండిరచారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం భూములి చ్చిన కార్మిక కుటుంబాల పొట్ట కొట్టడం తగునా? అని ప్రశ్నించారు. అడుగడుగునా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే.. ఏపీ బీజేపీ నేతలకు చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరమన్నారు. కేంద్రంతో చర్చలు నిర్వహించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేందుకు ప్రయత్నించాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img