Monday, April 29, 2024
Monday, April 29, 2024

వేర్పాటువాదాన్ని సహించం: చైనా

బీజింగ్‌: తైవాన్‌లో ఎటువంటి ‘‘వేర్పాటువాద కార్యకలాపాలను’’ సహించబోమని చైనా హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని కలుపుకుంటానని పునరుద్ఘాటించింది. తైవాన్‌ను తమ భూభాగంలో భాగంగా పేర్కొంటున్న బీజింగ్‌, అమెరికా ప్రతినిదుల స్పీకర్‌ నాన్సీ పెలోసి రాకతో తైవాన్‌ చుట్టూ అసాధారణ సైనిక విన్యాసాల నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు చైనాలోని తైవాన్‌ వ్యవహారాల కార్యాలయం ఆగస్టు 10న ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది, శాంతియుత పునరేకీకరణ కోసం మేము అవకాశానికి సిద్ధంగా ఉన్నాము, అయితే మేము ఏ రూపంలోనూ వేర్పాటువాద కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వం’’ అని పేపర్‌ పేర్కొంది.బల ప్రయోగ అవకాశాలనూ తోసిపుచ్చం. చైనా చివరిసారిగా 2000సంవత్సరంలో ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాదాపు 22ఏళ్ల తర్వాత భారీ సైనిక విన్యాసాల మధ్య మరోసారి ఈ పత్రాన్ని విడుదల చేసింది. 2016లో త్సాయి యంగ్‌ వెన్‌ అధికారంలోకి వచ్చాక చైనాతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img