Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డేటా సెక్యూరిటీపై ట్విట్టర్‌ అధికారులను ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానెల్‌

డేటా సెక్యూరిటీ, ప్రైవసీ గురించి ఇవాళ పార్లమెంటరీ ప్యానెల్‌ ట్విట్టర్‌ సంస్థ అధికారుల్ని ప్రశ్నించింది.భారత్‌లో జరుగుతున్న ఆపరేషన్స్‌పై ఇటీవల ఆ కంపెనీ ఉన్నతోద్యోగి కొన్ని సంచలన విషయాలను వెల్లడిరచారు. ఆ విజిల్‌ బ్లోయర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంటరీ ప్యానెల్‌ ట్విట్టర్‌ అధికారుల్ని నిలదీసింది.ట్విట్టర్‌ తీరు సంతృప్తికరంగా లేదని ప్యానెల్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగులు ఆ విజిల్‌ బ్లోయర్‌ చేసిన వ్యాఖ్యల్ని ఖండిరచారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇండియాలో ఎటువంటి డేటా సెక్యూర్టీ ఉల్లంఘన జరగలేదని అన్నారు.పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ ఐటీ విభాగం చైర్మన్‌ శశి థరూర్‌ నేతృత్వంలో ఈ మీటింగ్‌ జరిగింది. ట్వట్టర్‌ ఎగ్జిక్యూటివ్‌లు సమిరన్‌ గుప్తా, డైరెక్టర్‌ షాగుఫ్తా కమ్రాన్‌లు ఈ విచారణకు మాజరయ్యారు. పార్లమెంటరీ ప్యానెల్‌లో సభ్యులైన శశిథరూర్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌, సీపీఐ ఎంపీ జాన్‌ బ్రిటాస్‌లు మీటింగ్‌కు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img