Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సాగర్ ప్రాజెక్ట్ కు మళ్ళీ పెరిగిన ఇన్ ఫ్లో

పది క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల

విజయపురిసౌత్: ఎగువ నుంచి సాగర్ కు మళ్ళీ వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 10 క్రస్ట్ గేట్ల ద్వారా శనివారం నీటిని విడుదల చేశారు.సాగర్ జలాశయానికి 1,13,094 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో గా వస్తుంది. సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం 590.00 అడుగులకు చేరువైంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం. సాగర్ నుంచి కుడి కాల్వకు 9500 క్యూసెక్కుల నీరు,ఎడమ కాలువకు 4949 క్యూసెక్కులు , ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 32845 క్యూసెక్కుల నీరు ఎస్ఎల్బీసీకి 2400 క్యూసెక్కులు, వరద కాలువకు 400 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది సాగర్ ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు 5 అడుగులు మేర ఎత్తి 81000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి టోటల్ అవుట్ ఫ్లో గా 1,13,094 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.80 అడుగులు గా ఉంది. ఇది 214.3439 టీఎంసీల సమానం. శ్రీశైల జలాశయానికి జూరాల,రోజా ల నుండి 1,60429 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img