Monday, October 3, 2022
Monday, October 3, 2022

వైఎస్సార్‌ కళ్యాణమస్తు పేదలకు శుభమస్తు

ఉపసభాపతి కోన రఘుపతి


విశాలాంధ్ర బాపట్ల : వైఎస్సార్‌ కళ్యాణమస్తు పేదలకు శుభమస్తుగా ఉండబోతుందని పేదల ఇంట్లో పెళ్లి సంతోషంగా జరగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పధకానికి శ్రీకారం చుట్టారని ఉపసభాపతి కోన రఘుపతి తెలిపారు. పట్టణ కార్యాలయంలో సోమవారం పధకం ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా అప్పులు తిప్పలు తప్పేవి కాదని అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే పెద్దల అనేవారన్నారు. నేటి సమాజంలో ఒక సామాన్య కుటుంబం పెళ్లి చేయాలంటే ఎన్ని వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఈ పరిస్థిత్తుల్లో కళ్యాణమస్తు పధకం ఎంతో దోహదపడుతుందన్నారు. పడాలో నాకు తెలుసు. అదే పేదోళ్ల ఇంట్లో పెళ్లి అంటే ఆనందం మాటేలా ఉన్నా అప్పుల తిప్పలు తప్పవు. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు.. అని పెద్దలు అనేవారు. అలా అప్పులపాలు కాకుండా ఆనందాల అనుభూతులను మిగిల్చేలా ప్రభుత్వం అమలు చేయనున్న కళ్యాణమస్తు పథకం అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలు హామీని నెరవేర్చిందన్నారు. దీంతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన నిర్మాణ కార్మికులు, వికలాంగుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. పేద వర్గాల చదువుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా కానుక, నాడునేడు, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన పధకాలు పేదల ఆర్ధికాభివృద్ధికి దోహపడుతున్నాయన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఆర్భాటంగా ప్రచారం చేయటమే తప్ప ఏ పధకాలు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.అనంతరం రధంబజార్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు, మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చినపోతుల హరిబాబు, జడ్పీటీసీ పిన్నిబోయిన ఎస్తేరురాణి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, మహిళా అధ్యక్షురాలు గోర్రెముచ్చు పుష్పరాజ్యం, రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకులు వడ్డిముక్కల డేవిడ్‌,సయ్యద్‌పీర్‌,చింతల రాజశేఖర్‌, జోగి రాజా, అడె చందు తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img