Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

దావూద్‌ ఇబ్రహీంపై రూ. 25 లక్షల రివార్డ్‌

దావూద్‌ సహచరులపైనా ఎన్‌ఐఏ రివార్డులు
అంతర్జాతీయ గ్యాంగ్‌ స్టర్‌, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌ టార్గెట్‌ గా చేసిన కుట్రలపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు వేగవంతం చేసింది. అండర్‌వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ 25 లక్షల రూపాయల నగదు రివార్డును ప్రకటించింది. అతని సహచరులు అయిన చోటా షకీల్‌ పై రూ.20 లక్షలు అనీష్‌, చిక్నా, మెమన్‌ ఒక్కొక్కరిపై పదిహేను లక్షల రూపాయల చొప్పున నగదు రివార్డును ప్రకటించినట్టు ఎన్‌ఐఏ వెల్లడిరచింది.గత ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌ మాట్లాడుతూ… దావూద్‌, ఇతరులందరూ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌, ఆల్‌ ఖైదా వంటి అంతర్జాతీయ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లతో కలిసి పని చేస్తున్నారని తెలిపింది. బంగారం స్మగ్లింగ్‌, నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ కార్యకలాపాలను కొనసాగించిన దావూద్‌ కు చెందిన ‘డీ కంపెనీ’ రాత్రికి రాత్రే టెర్రరిస్ట్‌ సంస్థగా మారిపోయి 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిరదని పేర్కొంది. ఈ పేలుళ్లలో 250కి పైగా అమాయకులు ప్రాణాలను కోల్పోయారని… మిలియన్ల డాలర్ల విలువైన ఆస్తుల నష్టం జరిగిందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img