Monday, April 29, 2024
Monday, April 29, 2024

బీహార్‌ మంత్రికి శాఖ మార్పు.. గంటల్లోనే రాజీనామా, ఆమోదం

క్రిమినల్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి డిమోట్‌ చేశారు. తనకు గతంలో కంటే తక్కువ స్థాయి పదవి కేటాయించడంతో అలిగిన ఆ మంత్రి గంటల వ్యవధిలో రాజీనామా చేశారు. క్షణాల్లోనే ఆమోదించిన సీఎం.. దానిని గవర్నర్‌ ఆమోదానికి పంపారు. ఈ ఆసక్తికర పరిణామాలన్నీ జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో బీహార్‌ సంకీర్ణ ప్రభుత్వంలో చోటుచేసుకున్నాయి.ఆర్జేడీ నేత కార్తిక్‌ కుమార్‌ .. సీఎం నితీశ్‌ కేబినెట్‌లో న్యాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఓ కిడ్నాప్‌ కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో కార్తిక్‌కు మంత్రిపదవి కల్పించడంపై ఆలోచించాలని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన సీపీఐఎంఎల్‌, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను కోరాయి. దీంతో సీఎం నితీశ్‌.. ఆయనను న్యాయ శాఖ పదవి నుంచి తప్పించి చెక్కెర పరిశ్రమ శాఖను ఆయనకు కేటాయించారు. అలక బూనిన ఆయన గంటల వ్యవధిలోనే తన పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా పత్రాన్ని సీఎంకు అందించారు. ముఖ్యమంత్రి దానిని వెంటనే ఆమెదించి, గవర్నర్‌కు సిఫారసు చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ స్పందించింది. మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వంలో అప్పుడే ఒక వికెట్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img