Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టండి

జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సూచన

విశాలాంధ్ర,పార్వతీపురం: గణేష్  నిమజ్జనాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన పోలీస్ స్టేషన్ సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.వినాయక నిమజ్జనం జరిగేప్రదేశాలను, వినాయక విగ్రహాలు ఊరేగింపుగా నిమజ్జనానికి వెళ్లే మార్గాలను అధికారులు ముందుగా సందర్శించి, తగుజాగ్రత్తలు చేపట్టాలన్నారు.వినాయక నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుశాఖతోపాటు, మునిసిపాలిటి, పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ , అగ్నిమాపక శాఖలతో సమన్వయం  చేసుకోవాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల వద్ద బ్యారీకేడింగ్, ఈతగాళ్లను,  లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పటిష్ట  బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో ఎటువంటి అపశ్రుతులు, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వినాయక నిమజ్జనం నిర్వహించే తోటపల్లి ప్రాంతంలో నాగావళి నదీ పరివాహక ప్రాంతంను సందర్శించి, అధికారులకు భద్రతాపరమైన పలుసూచనలు చేశారు.
ఈజూమ్ కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్, ఎస్బి సిఐ ఎన్.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసుఅధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img