Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

స్ధానిక సంస్థల ను నిర్వీర్యం చేయడంలో బాబును మించిన జగన్ బాబు

విశాలాంధ్ర – ఒంగోలు : ప్రజా స్వామ్యం లో పరిపాలనా వికేంద్రీకరణ కు నమూనాలు గా ఉన్న స్ధానిక సంస్థల ను నిర్వీర్యం చేయడంలోనేటి జగన్ బాబు నాటిచంద్ర బాబు, లోకేష్ బాబు లకన్నా మేటి గావారిని మించి పోయాడని నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. వీర భద్రా చారి విమర్శించారు.భు దవారం సంస్ధ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పంచాయితీలకు,మండల, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరిగి ఒకటిన్నర సంవత్సరం కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులూ కేటాయించక పోగా కేంద్రనిధులను దారి మళ్లింపు చేయడం బాధ్యతా రహిత మన్నారు.సమాంతర వ్యవస్థలలో కూడా నాడు జన్మ భూమి కమిటీలు నేడు సచివాలయాలు రెండూ పంచాయితీ పాలనకు సమాంతరాలే నన్నారు.
సాధారణ నిధులు వినియోగానికి CFMS విధానం పేరుతో నెలలు తరబడి బిల్లులు జాప్యం
లాంటి అనేక ఆంక్షలతో పాలన చిన్నాభిన్నమై పోయిందన్నారు.నిధులు ఇవ్వకుండా కొత్త పథకాల పేరుతో నిరంతరం వేధింపులు జరుగుతున్నాయని అన్నారు.12 నెలలుగా శానిటేషన్, గ్రీన్ అంబాసిడర్ లకు జీతాలు చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అన్నారు.మీటర్లు,రీడింగ్ లేకుండా విద్యుత్ బిల్లులు బకాయిలు పేరుతో వసూళ్ల దోపిడీ నేరపూరిత మన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకునీ, ప్రజామోదం తో నెగ్గిన సర్పంచ్,ఎంపీపీ,ఎంపీటీసీ, జడ్పీటీసీ లు నేడు ఆర్థికభాదలుతో,రాజకీయ అవమానాలుతో అయోమయంలో కొట్టు మిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గౌరవ వేతనం సకాలంలో ఇవ్వక,గౌరవాన్ని ఇవ్వక, ఇప్పటికైనా స్ధానిక సంస్థల కు రావలసిన నిధులు విడుదల చేయాలని, ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యతల కున్న చట్టబద్దమైన వాటిని బదలాయించక పోతే రాబోవు ఎన్నికలలో స్ధానిక సంస్థల ఉసురు తగలక తప్పదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img