Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ముంపుకు గురైన పంటలకు నష్టపరిహారం అందజేయాలి

టీడీపినేతలు డిమాండ్

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని రామవరం గ్రామరెవెన్యూ పరిదిలో మంగళవారం కురిసిన భారీవర్షాలకు సుమారు రెండువందల ఎకరాలు పైగా వరి పంట ముంపుకు గురైన సంగతి తెలుసుకొని మాజీఎమ్మెల్సీ, టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జి బొబ్బిలి చిరంజీవులు అధ్వర్యంలో టీడీపీ నాయకులు బుధవారం ఉదయం సందర్శించారు.వెంగలరాయ సాగర్ మిగులనీరు,నిన్న కురిసినభారీవర్షాలు వల్ల గ్రామం కూడా ముంపుకు గురైందని వారు తెలిపారు. రామవరం, రెడ్డివాని వలస,అంటిపేట, కాసాపేటగ్రామాల్లో పంట ముంపుకు గురైందని చెప్పారు.వెంగలరాయ సాగర్ కాలువకు గండిపడిన అధికారులు పట్టించుకోక పోవడంవల్లనే నేడుముంపుకు గురైందని తెలిపారు.వ్యవసాయ,రెవెన్యుఅధికారులుఅంచనావేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గర్భాపు ఉదయభాను సీతానగరం మండలంపార్టీ అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, ప్రధానకార్యదర్శి రౌతు వేణుగోపాలనాయుడు,సీనియర్ నాయకులు సాలాహరగోపాల రావు  ,గ్రామసర్పంచ్ పెంట సత్యం నాయుడు, అంటిపేట మాజీ సర్పంచ్ పైలనాగభూషణరావు ,సురేష్,తేలు తిరుపతిరావు తదితరులుపాల్గొన్నారు.అనంతరం వారంతా పార్వతీపురం జిల్లా కలెక్టరు వద్దకు వెళ్లి ముంపు గూర్చి వివరించారు.
నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం నాయకులు డిమాండ్
రామవరం రెవెన్యూ పరిదిలో ముంపుకి గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మండల అధికారులు, జిల్లా కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని నాయకులు రెడ్డి లక్షుము నాయుడు, ఈశ్వరరావు, రమణమూర్తి తదితరులు డిమాండ్ చేశారు
అధికారులు సందర్శన:
ముంపుకు గురైన పంటలను, రామవరం గ్రామాన్ని తహశీల్దార్ ఎన్వీ రమణ, మండల వ్యవసాాయాధికారి అవినాష్, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది కలసి వెళ్ళి పరిశీలించారు. జిల్లా కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img