Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

2023 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందిస్తాం

రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు

పెద్దదోర్నాల : 2023 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు ,త్రాగు నీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలుగొండ ప్రాజెక్టు మొదటి, రెండు సొరంగాలను మంత్రి అంబటి రాంబాబు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు పనులపురోగతిపై ఏజెన్సీస్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు కు2004 లో శంకుస్థాపన చేశారని ఆయన తనయుడు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని ప్రకటించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిననెల్లూరు బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేసినఘనత చరిత్రలో మిగిలి పోయిందన్నారు. ప్రకాశము నెల్లూరు కడప జిల్లాల కరువు ప్రాంత రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెలిగొండప్రాజెక్టును చేపట్టారని, 4 లక్షల 35 వేలఎకరాలకు సాగునీరు, 15 లక్షలమందికి సాగునీరు అందుతుందని, ఫ్లోరైడ్ వాటర్ సమస్య అలాగే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు పీడిత ప్రాంతాలు సస్యశ్యామలంగా అవుతాయి ఇంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యతకలిగిన వెలిగొండ ప్రాజెక్టు ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయుటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఉన్నారని, అధికారులు, ఏజెన్సీలు తదనుగుణంగా యుద్ధప్రాతిపదికనపనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణము ప్రాముఖ్యతకలిగిన వెలిగొండ ప్రాజెక్టు ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయుటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఉన్నారని, అధికారులు, ఏజెన్సీలు తదనుగుణంగా యుద్ధప్రాతిపదికనపనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణము అనుకూలముగా లేనప్పుడు కొంత జాప్యం జరగవచ్చు అనుకూలంగా ఉన్నప్పుడు వేగవంతంగా పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ ప్రాజెక్టు అంచనాలు 8వేల కోట్ల రూపాయలు కాగా ఇప్పటివరకు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మిగతా రెండు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు చేయవలసి ఉందని వివరించారు. ఏది ఏమైనప్పటికీ గుత్తేదారులు, అధికారులు ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులను గుత్తేదారులు ఆదేశించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయుటయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయం అని, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు వరకు తీగలేరు కాలువ మరో 20 కిలోమీటర్ల పెంచి నిధులు మంజూరు చేశారని వివరించారు. మొదటి సొరంగం పూర్తి చేసుకున్నప్పటికీ రెండవ swarangan ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తే మిగతా పెండింగ్లో ఉన్న ఫీడర్ కాలువ ,తీగలేరు పనులు, మిగతా స్ట్రక్చర్ పనులు త్వరలో పూర్తవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యుడు కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పీటీసీ సభ్యులు అమ్మి రెడ్డి రామిరెడ్డి, వైకాపా మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, వైకాపా నాయకులు గుమ్మ ఎల్లేష్, పెద్దదోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, గ్రామ సర్పంచ్ చిత్తూరు హారిక, పలువురు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img