Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పంట కాలువను తలపించేలా ఉండి బస్టాండ్

ఉండి: ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు వెళ్లే మార్గము లేక ఉండి బస్టాండ్ పంట కాలువను తలపిస్తుంది. అనునిత్యం వందలాది సంఖ్యలో ఆకివీడు, కైకలూరు, ఏలూరు, విజయవాడ, గణపవరం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల,భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు బస్టాండ్ లోకి వెళ్లే మార్గము లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్ లో పోయిన నీరుని బయటికి తరలించేందుకు ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రయాణికులు కోరారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి పక్కనపెట్టి స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని పలువురు వాపోయారు. బస్టాండ్ లో నిలిచిపోయిన నీరుని బయటికి తీసే మార్గాన్ని తక్షణమే చేపట్టాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img