Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తంపర ముంపు పరిష్కారానికి కృషి

ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు

విశాలాంధ్ర – పోలాకి (శ్రీకాకుళం): ప్రతి ఏటా తంపర భూముల ముంపుకి గురవుతుండడంతో పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎంపీ కింజీరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. మంగళవారం మండలంలో గల సుసరాం ప్రియాగ్రహారం ప్రాంతాల్లో గల తంపర ముంపు ప్రాంతాలును పరిశీలనకు విచ్చేసిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రైతులతో మాట్లాడారు. ముంపు సమస్య చాలా తీవ్రమైనదని పరిష్కారానికి కలెక్టర్ తో చర్చిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. పంట నష్టపరిహారం గురించి కలెక్టర్ కు వివరిస్తానని రైతులుకు చెప్పారు. అడ్డంగా ఉన్న వంతెనలు కారణంగా ప్రతి యేటా తంపర ప్రాంతం ముంపునకు గురవుతున్న పరిస్థితి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నట్ల రైతులకు చెప్పారు. అనంతరం స్థానిక మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గతంలో చేపట్టిన తంపర కాలువ మరమ్మతులు ప్రస్తుతం ముంపు పరిస్థితిని ఎంపీ రామ్మోహన్ నాయుడుకు వివరించారు. ప్రియాగ్రహారం మాజీ సర్పంచ్ లావేటి కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు మాట్లాడుతూ నీరు మళ్లించేందుకు అనేక ప్రాంతాలలో కాలువలు ఉన్నప్పటికీ ముంపు సమస్య ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వర్షం వలన ముంపులకు గురవుతుండడంతో ప్రతి ఏటా ఆర్థికంగా నష్టపోతున్నట్లు మహిళ రైతులు తమ గోడు వినిపించారు. వారితోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వేణుగోపాలరావు మాజీ ఏఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు మాజీ జెడ్పిటిసి సభ్యులు రోనంకి కృష్ణారావు మండల టిడిపి పార్టీ నాయకులు మిరియాబిల్లి అప్పలనాయుడు లుకలాపు రాంబాబు గొర్లె ఎర్రయ్య డోల ప్రసాదరావు కోరాడ నాగరాజు మడ్డు అప్పయ్య పలువురు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img