Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులది కీలక పాత్ర

విశాలాంధ్ర`కొనకనమిట్ల : సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని మండల విద్యాశాఖ అధికారి ఎస్‌కె డాంగే షరీఫ్‌ అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరిగిన శిక్షణ తరగతుల సందర్భంగా ఆ పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దాసరి లక్ష్మీ గురుస్వామికి ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి రావడం పట్ల ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గురుస్వామి ఘనంగా సన్మానించారు. ఈ సభలో ఎంఈఓ మాట్లాడుతూ గురుస్వామి అన్ని రంగాల్లో విశేష ప్రతిభా గలిగిన ఉపాధ్యాయుడని ఆయన ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు పనిచేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. యుటిఎఫ్‌ నాయకులు పి శ్రీనివాసులురెడ్డి కే తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గురు స్వామి సైన్సు ఉపాధ్యాయుడు జన విజ్ఞాన వేదిక నాయకుడిగా విద్యార్థులను చైతన్యపరిచేందుకు సమాజ సేవా కార్యక్రమ లు చేపట్టి విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. సన్మాన గ్రహీత గురుస్వామి మాట్లాడుతూ నా 27 సంవత్సరాల అనుభవంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి హరిబాబు రిసోర్స్‌ పర్సన్‌ రమేష్‌రెడ్డి ఎల్‌ ఎఫ్‌ ఎల్‌ హెచ్‌ ఎం వెంకటరాజు చంద్రమౌళి శర్మ అపరంజి శివజ్యోతి స్వప్న సిఆర్పిలు పాల్గొన్నారు. అనంతరం గురుస్వామికి శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img