Homeజిల్లాలుఅనంతపురంకంచె దాటుతున్న యవ్వనం..

కంచె దాటుతున్న యవ్వనం..

- Advertisement -

ఆకర్షణకు లోనై ప్రేమ వివాహాలు.. తల్లిదండ్రుల ఆశలు ఆవిరి
ప్రశ్నార్థకంగా మారుతున్న యువత భవిష్యత్తు

​విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : ​ఓ యువతా… కన్నవారి కన్నీరు కావేరి కాకూడదు. నీ కన్న కలలన్నీ కల్లలు కాకూడదు. క్షణికావేశంలో కలిగే ఆకర్షణను ఃప్రేమః అనుకుని నీ జీవితాన్ని బలితీసుకోకు. నీకంటూ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉందని మర్చిపోకు. సంస్కారం లేని చదువు, బాధ్యత లేని యవ్వనం సమాజానికి ఎప్పుడూ ప్రమాదకరమే. నేడు ఈ ప్రాథమిక సూత్రాలను మరిచి యువత పెడదోవపడుతూ తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.
​ప్రేమకు ఎల్లలు, హద్దులు లేవని ఆనాడే కవులు చెప్పారు. ఆ ప్రేమలో పరిణతి ఉంటే జీవితం సంతోషమయంగా సాగిపోతుంది. అయితే, నేటి ఆధునిక సమాజంలో సాంకేతికత పెరిగినా సామాజిక స్పృహ మాత్రం పక్కదారి పడుతోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు నిండు కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. దీని వెనుక ఉన్న మూల కారణాలను విశ్లేషిస్తే చేదు నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల అనంతపురం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మండలంలో 15 రోజుల్లోనే నలుగురు మైనర్ల జంటలు తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లిపోయారు.

దీనిపై ఓ కథనం

శాస్త్రీయ అవగాహన కరువు

​ప్రస్తుత విద్యావ్యవస్థలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కంటే సిలబస్ పూర్తి చేయడమే ఏకైక లక్ష్యంగా మారుతోంది. ముఖ్యంగా యుక్తవయసులో హార్మోన్ల మార్పుల వల్ల కలిగే సహజమైన ఆకర్షణను ఃప్రేమఃగా భ్రమపడి విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు, విద్యాసంస్థల్లో సరైన కౌన్సెలింగ్ వ్యవస్థ కరువైంది.

డిజిటల్ మాయాజాలం – పెరిగిన దూరం

​స్మార్ట్‌ఫోన్లు మరియు సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత యువత బాహ్య ప్రపంచానికి, వర్చువల్ పరిచయాలకు దగ్గరై, కన్నవారికి మాత్రం మానసికంగా దూరమవుతున్నారు.
​ఇంట్లో సంబంధాల తెరమరుగు: పిల్లల మనోభావాలను గుర్తించడంలో తల్లిదండ్రులు విఫలమవుతుండటంతో వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతోంది. ఫలితంగా యువత కన్నవారి కంటే బయటి వ్యక్తుల మాటలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంట్లో పంచుకోలేని విషయాలను వెతుక్కుంటూ అపరిచితుల వలలో పడి, సరైన మార్గదర్శకత్వం లేక భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకుంటున్నారు.

పర్యవసానాలు

సరైన అవగాహన లేకపోవడం వల్ల యువత సులభంగా ఆకర్షణలకు లోనవుతున్నారు. అనారోగ్యకరమైన సంబంధాల్లో చిక్కుకుని చిన్న వయసులోనే జీవితాలను ఫణంగా పెడుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల కదలికలను గమనించకపోవడం వారు తప్పుదోవ పట్టడానికి ప్రధాన కారణమవుతోంది.

పరువు కోసం బలిపీఠం

​నేటి సమాజంలో పరువు, మర్యాదల పేరిట బంధాలు బలిపీఠం ఎక్కుతున్నాయి. గ్రామాల్లో మర్యాద పోతుందన్న భయంతో తల్లిదండ్రులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు విచారకరం. ఏదైనా కారణంతో అమ్మాయి అబ్బాయితో వెళ్లినప్పుడు, గ్రామస్థుల సూటిపోటి మాటలు భరించలేక తల్లిదండ్రులు ఆమెను అబ్బాయి ఇంటికి పంపించేస్తున్నారు. ఇది ఆ అమ్మాయి భవిష్యత్తును, కనీస వివాహ వయసును పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న ఃసామాజిక బహిష్కరణః వంటి చర్య. దీనివల్ల ఆర్థికంగా, మానసికంగా స్థిరత్వం లేని పరిస్థితుల్లో ఆ యువతులు నరకం చూస్తున్నారు.

పరిష్కార మార్గాలు:

​పాఠశాలల్లో కౌన్సెలింగ్: హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు శారీరక మార్పుల పట్ల అవగాహనతో పాటు, కెరీర్ మరియు భావోద్వేగ నియంత్రణపై నిపుణులతో తరగతులు నిర్వహించాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు