Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

లక్ష్మీదేవి, గణేషుడి ఫోటోలతో కరెన్సీ ముద్రించండి.. మోదీకి కేజ్రీవాల్‌ విజ్ఞప్తి!

కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి చిత్రాలను ముద్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. కొత్త కరెన్సీ నోట్లపై ఓవైపు మహాత్మా గాంధీ, మరోవైపు లక్ష్మీదేవి, గణేషుడు చిత్రాలు ఉండేలా చూడాలని కోరారు. ఈ ఇద్దరి దేవతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ఉండటం వల్ల దేశ అభివృద్ధి చెందడానికి సహకరిస్తాయని కేజ్రీవాల్‌ అన్నారు. అంతేకాదు, కేవలం 2 శాతం మంది హిందువులున్న ముస్లిం దేశం ఇండోనేషియాలో గణేషుడు ఫోటోతో ఉన్న కరెన్సీ నోట్లను వినియోగంలోకి తీసుకొచ్చారని ఉదాహరణగా చూపిన కేజ్రీ.. మనం ఎందుకు ముద్రించకూడదని ప్రశ్నించారు.‘‘కరెన్సీ నోట్లపై వినాయకుడి ఫోటోలను ముస్లిం దేశం ఇండోనేషియా వాడుతోంది.. ఆ దేశం ముద్రిస్తున్నప్పుడు మనం ఎందుకు అలా చేయకూడదు.. కాబట్టి కొత్త నోట్లపై హిందూ దేవుళ్ల ఫోటోలను ముద్రించాలి’’ అని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై రెండు రోజుల్లో ప్రధానికి లేఖ రాస్తానని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత చెప్పారు. దేశం ప్రస్తుతం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోందని, డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ భారీగా పతనమైందని గుర్తుచేశారు.త్వరలో జరగనున్న ఢల్లీి మున్సిపల్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీచేస్తుందా? అన్న ప్రశ్నకు కేజ్రీవాల్‌ బదులిస్తూ.. తాము పోటీకి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు. ఢల్లీిలో మున్సిపల్‌ ఎన్నికలతో పాటు గుజరాత్‌లోనూ పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, దీపావళి రోజున రాజధానిలో కాలుష్య స్థాయిలపై పెరగకుండా ప్రజలు తమ వంతు ప్రయత్నం చేశారని కేజ్రీవాల్‌ ప్రశసించారు. ‘‘స్వచ్ఛమైన గాలితో దిల్లీ నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం’’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img